రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సింగర్ ఎం ఎం శ్రీలేఖ.. చాలా మారిపోయారంటూ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా కొనసాగుతున్న వారిలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. స్టూడెంట్ నెంబర్ వన్ నుండి ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా సెలబ్రిటీలు ఈ పండుగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో రాజమౌళి సోదరి ఎంఎం శ్రీలేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఎం ఎం శ్రీలేఖ ప్రముఖ సింగర్ గా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఎం ఎం శ్రీలేఖ పాడిన ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరెట్ సాంగ్స్ గా ఉన్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎంఎం శ్రీలేఖ తన సోదరులు ఎం ఎం కీరవాణి, ఎస్ ఎస్ రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ వీడియో పాతది అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంఎం కీరవాణి, రాజమౌళి కి శ్రీలేఖ సోదరి వరుస అవుతుంది. రక్షాబంధన్ సందర్భంగా సెలబ్రిటీలు పండుగను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో గతంలో ఎం ఎం శ్రీలేఖ రాజమౌళి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎం ఎం శ్రీలేఖ కీరవాణి గురించి మాట్లాడుతూ.. తన సోదరుడు కీరవాణి పాడిన తెలుసా మనసా అనే సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. కీరవాణి తరువాత ఇళయరాజా పాటలు అంటే ఇష్టమని శ్రీలేఖ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళి ఫ్యామిలీకి నేనెప్పుడూ దగ్గరగానే ఉంటానని చెప్పుకొచ్చింది. రాజమౌళి తీసే సినిమాల విషయంలో పాటల విషయంలో ఆయన పేరు పేరుగా ఉంటుందని శ్రీలేఖ చెప్పుకొచ్చింది. గతంలో రాజమౌళి శాంతి నివాసం అనే సీరియల్ తీసే సమయంలో రాజమౌళి తనకు చాక్లెట్లు మ్యూజిక్ ఆల్బమ్స్ కొనిచ్చేవాడని కాకపోతే తాను డైరెక్టర్ గా మారిన తర్వాత బాగా మారిపోయాడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రాజమౌళి డైరెక్టర్ అయ్యాక సినిమాలతో బిజీగా అయ్యాడు. దీంతో రాజమౌళి డైరెక్టర్ గా మారిన తర్వాత తనను ఎక్కువగా పట్టించుకోవడం లేదని శ్రీలేఖ చెప్పుకొచ్చింది. రాజమౌళి గురించి శ్రీదేవి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.