టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు పొందిన పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలలో హీరోయిన్ గా నటించిన పూనమ్ కౌర్ తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి సినిమాలలో ఆఫర్లు తగ్గిపోవటంతో వెండితెరకు దూరమైంది. అయినా కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.
సినిమాలకు దూరమైన పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా తరచు వివాదాస్పదమైన పోస్టులు షేర్ చేస్తూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో తనని ఇబ్బంది పెట్టిన వారి గురించి ఇన్ డైరెక్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికీ తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన గ్లామర్ తో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
నార్త్ ఇండియాలో వివాహం తర్వాత మహిళలు తమ భర్త క్షేమం కోసం కార్వా చౌత్ పండగని సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లు ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ కూడా కార్వా చౌత్ పండగని జరుపుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో పూనమ్ అందంగా ముస్తాబయి దీపాల వెలుగులో జల్లెడ పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ పూనమ్ కౌర్ కి ఎప్పుడు పెళ్లయింది? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్ళి అయిన సంగతి ఇంతకాలం దాచిందా? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పూనమ్ కౌర్ షేర్ చేసిన ఈ ఫోటోలతో అనుమానాలు మొదలయ్యాయి