హీరోయిన్స్ అన్నాక ఖచ్చితంగా హాట్ గా కనిపించడం స్కిన్ షో చేయడం తప్పనిసరి. గత కొంతకాలంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్స్ హాట్ నెస్ లో బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గడం లేదు. టాలెంట్ ఉన్నా సినిమాలో కనీసం అన్నట్టుగా అందాల బోత చేయాల్సిందే. సినిమాకి ఇదొక కమర్షియల్ ఫార్ములా. ప్రేక్షకులని థియోటర్స్ వరకు రప్పించాలంటే మేకర్స్ కి ఇవన్నీ తప్పడం లేదు.
చెప్పాలంటే హీరోయిన్స్ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలలో నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ కూడా కథ నచ్చడం.. డిమాండ్ ని బట్టి వేదం సినిమాలో కాస్త బోల్డ్ గానే నటించింది. అయితే ఈ విషయంలో మాత్రం కొందరి లెక్కలు వేరేలా ఉంటున్నాయి. లిప్ కిస్సుల కి ఒక లెక్క.. స్కిన్ షో కి ఒక లెక్క.. ఇంకాస్త హద్దులు దాటి సీన్స్ చేయాల్సి వస్తే ఒక లెక్క అన్నట్టుగా ఉంది హీరోయిన్స్ వ్యవహారం. చెప్పాలంటే ఈ విషయంలో హీరోయిన్స్ ఇలాంటి స్ట్రాటజీని మేయింటైన్ చెయడం తప్పు కూడా కాదు.
ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి లైఫ్ టైం తక్కువ అని అంటుంటారు. వేళ్ళ మీద లెక్కపెట్టుకునే వాళ్ళు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. సెల్ఫ్ శాటిస్ ఫ్యాక్షన్ అయినా ఉండాలి.. లేదా బ్యాంక్ బ్యాలెన్స్ అయినా తృప్తిగా ఉండాలి అన్న మైండ్ సెట్ లో ఉన్నారు. ఆలోచిస్తే ఇది కరెక్టే. అలాంటి మైండ్ సెట్ అండ్ స్ట్రాటజీనే హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఫాలో అవుతుంది.
ఆర్ ఎక్స్ 100 తో టాలీవుడ్ కి పరిచయమైన పాయల్ ఫస్ట్ మూవీ తోనే మంచి పేరు సంపాదించుకుంది. కాని అనుకున్నంతగా అవకాశాలు రావడం లేదు. కెరీర్ లో ఆర్ ఎక్స్ 100 తర్వాత చెప్పుకోదగ్గ సినిమా చేసిందంటే అది వెంకటేష్ కి జంటగా వెంకీ మామ. అయినా నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోల కి జంటగా నటించే అవకాశాలు రావడం లేదు. ఇప్పటికే నటించిన రవితేజ సినిమాలో మళ్ళీ అవకాశాలు అందుకోలేకపోతుంది.
కాని పాయల్ మాత్రం సినిమాకి దాదాపు 40 లక్షలు డిమాండ్ చేస్తోందట. ఆర్ ఎక్స్ 100 సినిమా మాదిరిగా కాస్త బోల్డ్ గా నటించాలంటే ఈ రెమ్యూనరేషన్ తప్పనిసరి అంటుందట. రెమ్యూనరేషన్ బట్టే పర్ఫార్మెన్స్ ఉంటుందని ఒక లెక్క అని తెలుస్తుంది. చెప్పాలంటే ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ ఫాలో అవుతుంది ఈ పద్దతినే. మరి చూడాలి పాయల్ కి ఎలాంటి సినిమాలు వస్తాయో.