ఏ సినీ ఇండస్ట్రీ లో అయినా కూడా స్టార్ హీరోస్ తో పాటుగా చాలా వరకు కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే తమకంటూ సెపరేట్ చిత్రాలు మార్కెట్ తెచ్చుకోగలిగిన వారు ఉంటారు. అలాగే ఒక సినిమా తోనే మంచి క్రేజ్ హీరోయిన్స్ లో టాలీవుడ్ లో ఒక సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా ఒకామె అని చెప్పవచ్చు.
ఆమె మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100 తోనే మంచి క్రేజ్ ని తెచ్చుకున్న పాయల్ నెక్స్ట్ కూడా చాలా వరకు గ్లామర్ పాత్రలే చేసింది. అయితే ఆమె క్రేజ్ కి తగ్గట్టుగా ఓ సినిమా చేస్తే బాగుండు అని చాలా మంది అనుకోగా మళ్ళీ అదే ఆర్ ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో చేసిన ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే “మంగళవారం”.
మొదటిగా పాన్ సౌత్ భాషల్లో మాత్రమే ప్లాన్ చేసిన ఈ చిత్రం తర్వాత హిందీ కూడా యాడ్ చేసుకుంది. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో ట్రేడ్ లో అయితే సాలిడ్ బిజినెస్ జరుగుతుంది అని టాక్ ఉంది. ఇది వరకే ఈ సినిమాకి ఈజీగా 10 కోట్లకి పైగానే బిజినెస్ జరిగింది అని రూమర్స్ వచ్చాయి.
అయితే ఈ సినిమా విషయంలో ఎందుకో చిత్ర యూనిట్ తో పాటుగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారట. ,మెయిన్ గా పాయల్ మరియు దర్శకుడు అజయ్ భూపతి లు తమ మొదటి సినిమా లానే దీనికి కూడా మంచి వసూళ్లు వస్తాయనే నమ్మకంగా ఉన్నారట. మరి ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ కి తగ్గ అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి.