అవకాశాల కోసం కష్టాలు పడడం వేరు, ఆ తరువాత వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుని స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం వేరు. సినిమా ఇండస్ట్రీ లో రాణించాలంటే నటన తో పాటు సరైన పాత్రలు ఎంపిక చేసుకోవడం కూడా తెలిసుండాలి. ఒక్క హిట్ తో కెరీర్ ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు.
‘RX 100 ‘ సినిమాతో ఒక్కసారి గా టాక్ అఫ్ ది టౌన్ అయిన పాయల్ రాజపుట్ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ లేక ఇప్పటికీ కష్టపడుతుంది. పాయల్ లాగే షాలిని పాండే కూడా కి సరైన హిట్స్ లేవు. కనీసం పాయల్ కి ఏవో సినిమాలు వస్తున్నాయి. కానీ పాయల్ ని దాదాపు అందరు మర్చిపోయారు.
అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో షాలినీ పాండే జాతకం మారిపోయింది అనుకున్నారు . వరుస సినిమాలతో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రిని ఏలేస్తుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం భావించారు. సీన్ కట్ చేస్తే అమ్మడు ఖాతాలో ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ హీట్ పడలేదు.
తెలుగు లో అనుకున్నంత సక్సెస్ లేకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది షాలిని. లేటెస్ట్ సమాచారం ప్రకారం షాలిని పాండే ఓ క్రేజీ రోల్ ను యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది . ఈ సినిమాలో అమ్మడు బ్రోకర్ గా పనిచేస్తుందట . అంతేకాదు ఈ సినిమాలో ఆమె బ్రోకర్ గా తన దగ్గరకు వచ్చిన మగాళ్ళను ఎలా అయినా సరే సుఖపెట్టే క్యారెక్టర్ లాగా ఉంటుందని బాలీవుడ్ తెలుస్తుంది. చూడాలి ఈ సారైనా షాలిని పాండే కెరీర్ ముందుకు సాగుతుందో లేదో.