ఈ రోజు ఉదయంతోనే తెలుగు రాష్ట్రాల్లో ఓ ఊహించని వార్తతో అయితే అందరికీ షాక్ తగిలింది. మరి ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంతో అంతా కల్లోలంగా మారింది. అయితే ఇప్పుడు రాజకీయాల్లో సినిమాకి సంబంధించి కూడా పలువురు పలు పార్టీల నుంచి ఉండడం జరిగింది.
కాగా ఈరోజు బాబు అరెస్ట్ పై అయితే మన టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కూడా స్పందించడం జరిగింది. కాగా మొదట బాలయ్య మాట్లాడుతూ ప్రెజెంట్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై కౌంటర్ గా ఆయన్ని 16 నెలలు జైల్లో ఉంచారు కాబట్టి..
చంద్రబాబు నాయుడు గారిని 16 నిముషాలు అయినా జైల్లో ఉంచాలని అనుకుంటున్నారని అలా ఆనంద పడాలి అనుకుంటున్నారు అని అందుకే ఇదంతా కక్ష పూరితంగా చేస్తున్నదే అని ఖండించారు. కాగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వీడియో రిలీజ్ చేసి తాను కూడా చంద్రబాబు అరెస్ట్ ని సంపూర్ణంగా ఖండిస్తున్నాను అని..
తమని గతంలో వైజాగ్ లో కూడా ఈ ప్రభుత్వ అండతో పోలీస్ శాఖ వారు ఇబ్బంది పెట్టారు అని ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు అని పవన్ తెలిపారు. అలాగే తాను ఈ అరెస్ట్ ని ఖండిస్తున్నాను అని కూడా తెలియజేసారు. దీనితో హీరోస్ విషయంలో అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాలు సహా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.