రేణు దేశాయ్ కి ఆస్తి మొత్తం రాసిచ్చిన పవన్ కళ్యాణ్..? వైరల్ అవుతున్న వ్యాఖ్యలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాల కాలంగా స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ప్రవేశించి సొంతంగా పార్టీని స్థాపించాడు. ఇక ఆంధ్రప్రదేశ్ అధికారపక్ష పార్టీ మీద తరచూ విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ రాజాగా మంగళగిరి పర్యటనలో వైసిపి పార్టీ కార్యకర్తల మీద తీవ్రస్థాయిలో పిలుచుకుపడ్డాడు.ఇటీవల మంగళగిరి పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి, అలాగే ప్యాకేజీ కల్యాణ్ అంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై మండిపడుతూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొదటి ఇద్దరు భార్యలతో తనకి కుదరకపోవడం వల్లే వారికి విడాకులు ఇచ్చి భరణం చెల్లించిన తర్వాతే మూడవ పెళ్లి చేసుకున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ తన భార్యలకు భరణం చెల్లించానని వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే యువతిని వివాహం చేసుకొని కొంతకాలం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి భరణంగా ఐదు కోట్లు చెల్లించినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే బద్రి సినిమా షూటింగ్ సమయంలో రేణు దేశాయ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఆమెని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో పవన్ కళ్యాణ్ ఆమెకు విడాకులు ఇచ్చి తన ఆస్తి మొత్తం భరణం గా చెల్లించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లేజినోవో ని మూడవ వివాహం చేసుకొని ప్రస్తుతం ఆమెతో కలిసి జీవిస్తున్నాడు.