సాయి ధరమ్ తేజ్‌కి పవన్ కళ్యాణ్ వార్నింగ్.!

మాట తడబడుతోంది.. అయినా, ‘విరూపాక్ష్’ సినిమా ప్రమోషన్లలో ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్. యాక్సిడెంట్ కారణంగా తీవ్రమైన గాయాలతో.. ఆసుపత్రిలో చేరి, ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు సుప్రీం హీరో.

కోలుకున్నాడుగానీ.. ఇంకా ‘వాయిస్’ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో సెటైర్లు అవసరమా.? హెల్మెట్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నాడు.. మంచిదే.! కానీ, అందులో మళ్ళీ డబుల్ మీనింగ్ ఎందుకు.?

ఈ విషయం మేనమామ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందట. ‘విరూపాక్ష’ మీద సింపతీ బాగానే వర్కవుట్ అయ్యేలా వుందనీ, ఈ పరిస్థితుల్లో కాంట్రవర్సీలెందుకనీ మేనల్లుడికి పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకున్నాడట.

దాంతో, ఏదో పొరపాటున హెల్మెట్‌కి ఇంకో అర్థం తీశాననీ, అనుకోకుండా జరిగిందనీ.. తాజాగా కవరింగ్ ఇచ్చాడు. అద్గదీ అసలు సంగతి.