‘వీరమల్లు’ నుండి పవన్ కళ్యాణ్ ఫోటో లీక్ .. పిక్ వైరల్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో హిస్టారికల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ అభిమానుల్లో లో హై ఓల్టేజ్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకి “వీరమల్లు” అనే టైటిల్ ను అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ సినిమా టైటిల్ పైన, పవన్ గెటప్ పైనా ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈ సినిమా సెట్ నుంచి ఓ ఫోటో లీక్ అయ్యి నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వీరమల్లు సినిమా నుంచి లీక్ అయిన పవర్ స్టార్ పిక్ వైరల్..!

15 శతాబ్దం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామాలో.. పవన్ బందిపోటు దొంగ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకి ” హరిహర వీరమల్లు” అని కూడా టైటిల్ పెట్టె అవకాశం ఉండొచ్చు. ఈ సినిమా లో పవన్ గెటప్ కోసం దర్శకుడు క్రిష్ చాలా కష్టపడ్డారట. త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతున్న ఈ మూవీని.. దాదాపు 170 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించబోతున్నారట.

ప్రస్తుతానికి ‘pspk 27’ వర్కింగ్ టైటిల్ గా ఉన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివార్లలో శరవేగంగా కొనసాగుతోంది. కాగా.. షూటింగ్ స్పాట్ నుంచి పవన్ లేటెస్ట్ పిక్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ ఫొటోలో పవన్ పీరియాడికల్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ దుస్తుల్లో పవన్ యోధుడిలా కనిపిస్తున్నారు.మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11 న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. అయితే.. ఈలోగానే వచ్చిన ఈ పిక్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా.. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.