ఆ అమ్మాయి ప్రేమలో పడిన అడివి శేష్… బయటపెట్టిన అసలు నిజం?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా మేజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అందుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తాజాగా ఈయన హిట్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో ఈ హీరో ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈయన తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈయన తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టారు. ప్రస్తుతం తాను హైదరాబాద్ కి చెందిన ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నానని తెలిపారు. అయితే అది ప్రేమ ఆకర్షణ అనే కన్ఫ్యూషన్ లో తాను ఉన్నానని వెల్లడించారు.

ఇక పలాన అమ్మాయిని తాను ఇష్టపడుతున్నప్పటికీ ఈ విషయం తనకు చెప్పే సమయం కానీ తన గురించి ఆలోచించే సమయం కానీ నాకు లేదని అడివి శేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ప్రేమ గురించి అడవి శేష్ బయట పెడుతూ తాను ఆ అమ్మాయికి ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నానని అసలు నాది ప్రేమ కాదు అనే కన్ఫ్యూజన్లో ఉన్నానని చెప్పడంతో ఎంతోమంది ఈ విషయంపై స్పందించి మీరు మీ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పకుండా ఆ అమ్మాయిని మోసం చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా శేష్ తొందరగా ఈ విషయాన్ని ఆమెకు చెప్పడమే మంచిది అంటూ మరికొందరు సలహాలు కూడా ఇస్తున్నారు.