రామ్ చరణ్ వద్ద అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పటికీ తిరిగిఇవ్వలేదట…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కుటుంబంలో చిరంజీవి తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కోసం అతని అభిమానులు వారి ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడరు. ఇలా పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప ఇమేజ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దగ్గర అప్పు చేశాడని అయితే ఇప్పటికీ ఆ అప్పు తిరిగి చెల్లించలేదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తానే స్వయంగా వెల్లడించారు. అసలు విషయం ఏమిటంటే.. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తాను అప్పు తీసుకున్న సంగతి స్వయంగా వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను హీరో అయినా కూడా నా దగ్గర కనీసం 10 రూపాయలు కూడా డబ్బులు ఉండేవి కావు. వదినని అడగాలంటే ఇబ్బందిగా అనిపించి రాంచరణ్ వద్ద ఉన్న డబ్బులు అప్పు తీసుకొనే వాడిని.

హీరోగా చేస్తున్నాను కాబట్టి ఎక్కువ డబ్బులు వచ్చాక వడ్డీతో కలిపి అప్పు తిరిగి ఇస్తా అని చెప్పి రామ్ చరణ్ వద్ద అప్పు తేసుకునేవాడిని. రామ్ చరణ్ కూడా తన దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇచ్చేవాడు. కానీ ఇప్పటివరకూ ఆ అప్పు చెల్లించలేదు అంటూ పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ రామ్ చరణ్ అప్పు తీర్చాడో? లేదో తెలీదు మారి.