పవన్ కళ్యాణ్‌కి అది ఇష్టం లేకపోయినా.!

సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్ని ఒకేసారి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తప్పదు, ఆయనున్న పరిస్థితి అలాంటిది.

ఇక, ‘బ్రో’ సినిమా కోసం తాజాగా ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి ఈ స్పెషల్ సాంగ్ విషయమై పవన్ కళ్యాణ్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదట. దర్శకుడు సముద్ర ఖని కూడా స్పెషల్ సాంగ్ ఆలోచన తొలుత చేయలేదట.

కానీ, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషంలో స్పెషల్ సాంగ్ చేయాల్సి వచ్చిందంటున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ అప్పటికే పూర్తయిపోయాయి. మళ్ళీ అదనంగా ఓ మూడు రోజులు కేటాయించారట.

రోజుకి రెండు కోట్లు.. అని ఈ సినిమా రెమ్యునరేషన్‌పై గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్, ఈ స్పెషల్ సాంగ్ డేట్స్ మాత్రం.. అందులో కలపలేదని తెలుస్తోంది.