ఇన్సైడ్ టాక్ : మరో హ్యాట్రిక్ కాంబినేషన్ తో పవన్ కళ్యాణ్.?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే కాకుండా మరోపక్క పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి అలాగే దీనితో పాటుగా ఇప్పుడు దర్శకుడు క్రిష్ తో భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” ని అయితే తాను చేస్తున్నాడు.

ఇక ఈ చిత్రం తర్వాత పవన్ మరిన్ని సినిమాలు చేయాల్సి ఉండగా తన కెరీర్ లో ఇప్పటికొచ్చి అయితే మొదటిసారిగా దర్శకుడు త్రివిక్రంతో పవన్ హ్యాట్రిక్ సినిమాలు చేసాడు. అలాగే రెండో సరి కూడా పెద్దగా మరో దర్శకునితో కూడా పవన్ చేసింది లేదు.

మరి పూరి తర్వాత అయితే రెండో సారి దర్శకుడు హరీష్ శంకర్ కి అయితే పవన్ అవకాశం ఇచ్చాడు. ఇది ఇంకా ఇప్పుడు సెట్స్ మీదకి కూడా వెళ్ళలేదు. ఇక ఈ చిత్రం సంగతి పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ దర్శకుడు హరీష్ శంకర్ తోనే పవన్ ముచ్చటగా మూడో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

అంటే ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఇదంట. ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే ఈ సినిమా “భవదీయుడు భగత్ సింగ్” కన్నా ముందే ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కి రిలీజ్ కావడానికి ఛాన్స్ ఉన్నట్టుగా సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న సమాచారం. మరి దీనితో అయితే ఈ ఇద్దరి నుంచి హ్యాట్రిక్ బొమ్మ పడనుంది అని చెప్పొచ్చు.