ఘట్టమనేని ఫ్యామిలీకి ఐరన్ లెగ్ గా మారిన పవిత్ర లోకేష్.. భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్?

ఘట్టమనేని ఫ్యామిలీకి ఏడాది పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటికే మహేష్ బాబు కుటుంబ సభ్యులు ముగ్గురు మరణించడంతో మహేష్ కుటుంబానికి తీరని లోటు అని చెప్పాలి.ఏడాది మొదట్లో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అయితే తన అన్నయ్య మరణం నుంచి కోలుకున్నటువంటి మహేష్ తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. ఇకపోతే సెప్టెంబర్ నెలలో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కూడా మరణించారు.

ఇక నేడు తెల్లవారుజామున సూపర్ స్టార్ కృష్ణ కూడా కన్నుమూశారు.ఇలా సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చివరిసారిగా లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారిని చూడటం కోసం పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటి వద్దకు క్యూ కడుతున్నారు. ఇకపోతే కృష్ణ మరణించడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ మహేష్ బాబు ఫ్యామిలీలోకి నటి పవిత్ర లోకేష్ రావడం వల్లే ఇలా జరుగుతున్నాయని ఆమె ఐరన్ లెగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నటి పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా నటుడు నరేష్ తో కలిసే రిలేషన్ లో ఉన్న విషయం తెలిసింది.ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండటమే కాకుండా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక వీరి రిలేషన్ కు సూపర్ స్టార్ కృష్ణ కూడా అనుమతి తెలిపారు అంటూ వార్తలు వచ్చాయి. ఇలా మహేష్ బాబు ఫ్యామిలీలోకి పవిత్ర లోకేష్ అడుగు పెట్టడం వల్ల ఇలా జరుగుతుందంటూ సోషల్ మీడియాలో కొందరు అభిమానులు నటి పవిత్ర లోకేష్ పై ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు.ఇక కృష్ణ గారు మరణించారనే వార్త తెలియగానే పవిత్ర లోకేష్ నటుడు నరేష్ తో కలిసి కాంటినెంటల్ ఆసుపత్రికి వచ్చారు.