Pavitra Lokesh: సినీ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ను నాలుగవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయన తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు. ఇలా ముగ్గురికి విడాకులు ఇచ్చిన అనంతరం నటి పవిత్ర లోకేష్ తో కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా పెళ్లినీ అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ జంట ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా నటుడు నరేష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా పవిత్ర లోకేష్ నరేష్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నేను షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చాననీ తెలిపారు. నరేష్ గారు ప్రతిరోజు తన ఇద్దరు గురువులను తలుచుకుంటూ ఉంటారు తన ఇద్దరు గురువులలో తన తల్లి విజయనిర్మల గారు ఒకరు కదా జంధ్యాల గారు మరొకరు అని తెలిపారు. ఆయనకు ఉన్న స్టేటస్ కి అలా వారిని తలచుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయనకు పెద్దలు అంటే చాలా గౌరవమని తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ ఎనర్జీ గురించి కూడా ఆమె మాట్లాడారు. నరేష్ గారు చాలా యాక్టివ్గా ఎంతో ఎనర్జీగా ఉంటారు ఆయనకు పదిమందికి ఉండే ఎనర్జీ ఉందని తెలిపారు. ఆయన ఎప్పుడు ఎనర్జీతోనే ఉంటారని, రాత్రి అయితే నాకు అలుపు వస్తుంది, మా స్టాఫ్ అంతా కూడా అలసిపోతాము. ఇలా సాయంత్రానికి నేను అలసిపోయి ఏదైనా పనులు మిగిలి ఉంటే తనని చూసుకోమని చెబుతాను కానీ ఆయన మాత్రం ఎంతో ఎనర్జీతోనే ఉంటారని తెలిపారు.
ఇలా నరేష్ ఎనర్జీ గురించి పవిత్ర లోకేష్ మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నరేష్ నటి విజయ నిర్మల వారసుడనే విషయం మనకు తెలిసిందే .ఈయన కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో సక్సెస్ అందుకున్న నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ తరచూ వార్తలలో నిలుస్తున్నారు.