Paruchuri Venkateswarrao:తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఎన్నో సినిమాలకు అద్భుతమైన డైలాగ్స్ అందించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300 సినిమాలకు పైగా రచన అందించారు. నటులుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.1981లో పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ లకు ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి, తన సొంత చిత్రం ‘అనురాగదేవత’ ద్వారా రచయితులగా ఇండస్ట్రీకి పరిచ చేశారు ఎన్టీఆర్ .
నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో పని చేసిన అనుభవం వీళ్ల సొంతం. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయినా ఖైదీ నెంబర్ 150 వరకు వీరి సినీ ప్రయాణం సాగించారు. ప్రస్తుతం వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాత్రం యూ ట్యూబ్ ఛానెల్ నడుపుతూ సినిమా రివ్యూస్ చెప్తుంటారు.పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు (80) ప్రస్తుతం వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కనీసం బయటకు కూడా రావడం లేదు.పైగా కొన్నేళ్ల కింద ఆయన భార్య చనిపోయారు. అప్పట్నుంచి మరింత కుంగిపోయారు పరుచూరి వెంకటేశ్వరరావు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఆయన దర్శనమే లేకుండా పోయింది.
అయితే ఇటీవలే ఆయనని కలిసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ పరుచూరి వెంకటేశ్వరరావురు తో దిగిన ఫోటో ఒక దానిని ఆయన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా పోస్ట్ చేశారు. ‘గురువు గారు వెంకటేశ్వరరావును చూసి బాధపడ్డాను కానీ దేవుడి దయవల్ల ఆయన మానసిక స్థితి ఎప్పటిలానే చురుకుగా ఉంది’ అని పేర్కొన్నారు. ఈ పిక్ చూసి అందరు షాక్ అవుతున్నారు.. వెంకటేశ్వరరావు గారు ఇలా అయ్యరెంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..