హీరోయిన్ లైలాను పడేసేందుకు ప్రయాసలు.. డ్యాన్సర్ పండు వేషాలు వైరల్

Pandu Flirts Laila In Bomma Adirindhi

బొమ్మ అదిరింది షోలో ప్రతీ వారం డ్యాన్సర్ పండు వేసే వేషాలు అందరికీ తెలిసిందే. నాగబాబును డ్యాడీ అంటూ పిలవడం, పెళ్లి చేయమని గోల చేయడం, వచ్చే ప్రతీ గెస్ట్‌ను ఓ పిల్లను సెట్ చేయమని అడగడం బాగానే వైరల్అయింది. అలా పోసాని, శివ శంకర్ మాస్టర్, రఘు మాస్టర్ పండు కోసం పిల్లను సెట్ చేస్తామని చెప్పి బాగానే ఎంటర్టైన్ చేశారు. అయితే వచ్చే వారం హీరోయిన్ లైలా స్పెషల్ ఎంట్రీ ఇవ్వనుంది.

Pandu Flirts Laila In Bomma Adirindhi
Pandu Flirts Laila In Bomma Adirindhi

మామూలుగా పండు బొమ్మ అదిరింది శ్రేష్ట, అక్సాఖాన్‌లను పడేసేందుకు బాగానే ట్రై చేస్తాడు. అవన్నీ కామెడీగానే ఉంటాయి. స్క్రిప్ట్ ప్రకారమే అదంతా జరుగుతున్నా కూడా ఎంటర్టైన్మెంట్ బాగానే వస్తోంది. శ్రీముఖి పండు సంభాషణలు, జానీ మాస్టర్ పండు మీద వేసే సెటైర్లు బాగానే పేలుతుంటాయి. అయితే ఈ సారి లైలా గెస్ట్‌గా రావడంతో ఆమెను పడేసేందుకు పండు నానా తంటాలు పడ్డాడు.

లైలా అంటూ.. గుండె విలవిలా.. కాపాల కాస్తాను కుక్కలా.. ఉంటాను కాళ్ల కింద చెప్పులా అంటూ ఇలా ఏదేదో కవిత్వం రాశాడు. ఇక మళ్లీ అల్లు అర్జున్‌లా టోపీతో విన్యాసాలు చేశాడు. నా పేరు సూర్య సినిమాలో బన్నీ చేసిన ఫీట్లను లైలా ముందు చేసి పటాయిద్దామని చూశాడు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. మధ్యలోనే బిస్కేట్ అయింది. ఆ టోపీతో సరిగ్గా డ్యాన్స్ మూమెంట్స్ చేయకపోవడంతో అందరూ నవ్వేశారు.