Young Hero : ఓ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడున్న ప్రపంచంలో ప్రమోషన్ లే ఏకైక దారి. మన టాలీవుడ్ బిగ్ స్టార్ సినిమాలు కూడా ఈ ప్రమోషన్స్ లేకపోతే అస్సాం ట్రైన్ ఎక్కక తప్పడం లేదు. అందుకే వీటిని ఎంత జాగ్రత్తగా ఎంత కొత్తగా హ్యాండిల్ చేస్తే ఆడియెన్స్ లో ఏ సినిమాకి అయినా మంచి రీచ్ వస్తుంది.
అయితే యంగ్ హీరోల సినిమాలకి అయితే అవి మరింత అవసరం అందుకే వారు కూడా ఎప్పటికప్పుడు తమ సినిమాని ప్రేక్షకుల్లో తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. అలా తాజాగా టాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ చేసాడు.
నిజంగా చెప్పాలంటే తన లేటెస్ట్ సినిమా “అశోక వనంలో అర్జున కళ్యాణం” కి ముందు అంత బజ్ లేదు. వరుస వాయిదాలు పడడంతో ఆసక్తి తగ్గింది. కానీ రీసెంట్ గా వారు ఒక ప్రాంక్ వీడియో చెయ్యడం అది కాస్తా ఎటెటో వెళ్లి ఎలక్ట్రానిక్ మీడియాలో విశ్వక్ సేన్ బాగా హైలైట్ అవ్వడం జరిగింది.
పైపెచ్చు ఇప్పుడు ఈ యంగ్ హీరోకి మంచి సింపతీ కూడా వచ్చేసింది. దీనితో మంచో చెడో వీరు చేసిన ప్రయత్నం అయితే ఫైనల్ గా సినిమాపై మంచి అటెన్షన్ ని ఆడియెన్స్ లో తీసుకొచ్చేసింది. దీనితో డెఫినెట్ గా ఈ సినిమాకి మంచి వసూళ్లు నమోదు అవ్వడం గ్యారెంటీ అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఫైనల్ గా విశ్వక్ సేనే విజయం సాధించాడు.