సరికొత్త అవతారమెత్తిన ‘పాగల్’

ఇటీవల ‘పాగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి తనదైన నటన కనబరిచిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రోడు విశ్వక్‌సేన్ ఓ షాకింగ్ అవతారంలో కనిపించి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘గామి’. లేటెస్టుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా కోసం విశ్వక్‌సేన్ అఘోరా అవతారమెత్తినట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు, అతను ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నట్లుగా అర్ధమవుతోంది టీజర్ చూస్తే.

కథల ఎంపికలో విశ్వక్‌సేన్‌కి మంచి టేస్ట్ ఉందనే చెప్పాలి. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు మనోడు. ఆ క్రమంలోనే ఈ ‘గామి’ చిత్రం కూడా ఉండబోతోందని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.

ఈ సినిమాలో ‘కలర్ ఫోటో’ ఫేమ్ ఛాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మిస్టీరియస్ సబ్జెక్ట్‌గా రూపొందుతోన్నఈ మూవీలో మరిన్ని షాకింగ్ ఎలిమెంట్స్ఉన్నాయనీ, త్వరలోనే అవి ఒక్కొక్కటిగా రివీల్ చేయనున్నారనీ ఇన్‌సైడ్ వర్గాల సమాచారం. విద్యాధర్ కాగిట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మన ఫలక్‌నుమా దాస్ మరోసారి ఏదో కొత్త ప్రయోగం చేసేలానే ఉన్నాడు సుమా.