Paagal : డైరెక్టర్‌ని మార్చేసిన ‘పాగల్’ బాబు.! ఎక్కడ తేడా కొట్టిందో.!

Paagal : ఫలక్‌నుమాదాస్’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన కుర్రోడు విశ్వక్‌సేన్. ఈ కుర్రోడు కేవలం నటుడు మాత్రమే కాదు. మల్టీ టాలెంటెడ్. దాదాపు సినిమాకి సంబంధించి అన్ని విభాగాల్లోనూ వేలు పెట్టగల సమర్ధుడే. ‘హిట్’ తదితర సినిమాల రూపంలో మనోడి ఖాతాలో సక్సెస్‌లు కూడా వున్నట్లే.

తాజాగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాలో నటించాడు. త్వరలోనే రిలీజ్‌కి రెడీగా వుందీ సినిమా. దాంతో పాటు ‘దస్‌కా దమ్‌కీ’ అను మరో సినిమానీ సెట్స్ మీదుంచాడు మనోడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నిర్మాణం ఆలస్యమైంది.

అన్నట్లు ఈ సినిమాకి విశ్వక్‌సేన్‌తో ‘పాగల్’ అనే సినిమాని తెరకెక్కించిన నరేష్ దర్శకుడు. ‘పాగల్’ సినిమా విషయానికి వస్తే, ధియేటర్ బొమ్మ కాదు కానీ, ఓటీటీలో బాగానే ఎంటర్‌టైన్ చేసిందీ సినిమా. అదే దర్శకుడితో మన పాగల్ బుల్లోడు తాజా మూవీ ‘దస్‌కా దమ్‌కీ’ సినిమా చేస్తున్నాడు. అంతా బాగానే వుంది. ఇక్కడే ఓ చిన్న చిక్కొచ్చి పడింది.

‘దస్‌కా దమ్‌కీ’ సినిమాకి మన హీరో గారే కథ, మాటలు అందించేశారు. నిర్మాత ఎవరో వున్నారనుకోండి. ఇక దర్శకత్వం విషయానికి వస్తే, నరేష్ పట్ల మనోడు అంత సంతృప్తికరంగా లేడట. దాంతో డైరెక్షన్ కూడా తానే చేసుకోవాలనుకుంటున్నాడట.

దాసుగారి సన్నిహితులు కూడా అదే సలహా ఇస్తున్నారట. దాంతో మనోడు సింపుల్‌గా నరేష్‌ని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించేశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. చూడాలి మరి, ఈ గుప్పు గుప్పు గాసిప్‌లో నిజమెంతో.!