తెలుగు సినిమా నెత్తిన ఓటీటీ రాక్షసి.? అదేంటీ.!

ఈ మధ్య సినిమాలకు ఓటీటీ ఓ వరంలా మారింది కదా.? ఇప్పుడేంటి ఈ రాక్షసి గోల.? అంటే, సినీ వర్గాల్లో అలాగే చర్చ జరుగుతోంది. స్టార్‌డమ్ వున్న సినిమాలైతే ఓకే. ఓ మోస్తరు సినిమాలైతే ‘ఓటీటీ డీల్స్’ విషయంలో నరకం చూస్తున్నాయట.

హిట్టొస్తే సరే సరి.. ఫ్లాపయితే మాత్రం ఓ మోస్తరు హీరోల్ని ఓటీటీ సంస్థలు అస్సలు కన్సిడర్ చేయడంలేదట. ఓ యంగ్ హీరో ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చవిచూడ్డంతో, సాధారణంగా అతనికి వుండే ఓటీటీ మార్కెట్‌లో ఇప్పుడు పదో వంతు కూడా రేటు పలకడంలేదట.

‘సినిమా స్ట్రీమింగ్ చేస్తాం.. స్ట్రీమింగ్ మినిట్స్‌ని బట్టి పేమెంట్ వస్తుంది..’ అంటూ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సదరు యంగ్ హీరో సినిమా విషయమై తేల్చి చెప్పేసరికి, సదరు చిత్ర నిర్మాతకి మైండ్ బ్లాంక్ అయ్యిందట.

ఓటీటీ మార్కెట్‌లో పోటీ పెరిగినా, కార్పొరేట్ సిండికేట్ వ్యవహారం బలపడుతుండడంతో.. ముందు ముందు పెద్ద సినిమాలకూ ఓటీటీ రక్కసి నుంచి ముప్పు తప్పకపోవచ్చంటున్నారు.