మెగాస్టార్ చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ ప్రారంభం… వైరల్ అవుతున్న ఫోటోలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి కూడా మంచి గుర్తింపు ఉంది. అల్లు రామలింగయ్య నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లుఅర్జున్ నటుడిగా గుర్తింపు పొందారు.అలాగే నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు అల్లు అరవింద్. ఆ తర్వాత అల్లు అర్జున్ అల్లు, అల్లు శిరీష్ హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా కూడా అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

ఇదిలా ఉండగా అల్లు కుటుంబం గతెడాది గండిపేట సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ నిర్మాణం ప్రారంభించారు.ఇటీవల నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న అల్లు స్టూడియోస్ దివంగత నటుడు అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అక్టోబర్ ఒకటవ తేదీ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మితమైన ఈ స్టూడియోలో అల్లు అర్జున్ నటించబోయే పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా అక్టోబర్ 1 న ప్రారంభించారు.

ప్రస్తుతం అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా .. పుష్ప 2 సినిమాకి సంబందించిన అధిక శాతం షూటింగ్ అల్లు స్టూడియోస్ లో నిర్మించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కీలకపాత్రలో సాయి పల్లవి నటించనుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే.