సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న మూవీ యశోద. ఈ మూవీలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే యశోద మూవీకి సంబంధించిన పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకులను మరింత ఆకర్షించి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది.అయితే సమంత ఇటీవలే అరుదైన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ వైద్యం తీసుకుంటూనే యశోద మూవీకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాపై ఆమెకున్న ప్రేమను, మమకారాన్ని, అంకిత భావాన్ని నిరూపించుకుంది.
తాజాగా యశోద మూవీ ప్రమోషన్ లో భాగంగా సమంత కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. అలాగే తన ఆరోగ్య విషయాలను మాట్లాడుతూ కంటతడి పెట్టి బాగా ఎమోషనల్ అయ్యారు. సాధారణంగా ఏ సినిమా కథనైనా విన్న తర్వాత ఓకే చేయడానికి కొంత సమయం తీసుకుంటాను. కానీ యశోద సినిమా కథను మాత్రం దర్శకుడు చెప్పిన వెంటనే ఓకే చెప్పేశాను. ఈ కథలో యశోద క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండి ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అందుకే నాకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశా. ఈ సినిమా ద్వారా దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.
సమంత అరుదైన వ్యాధితో బాధపడుతూ కూడా చికిత్స తీసుకుంటూనే యశోద మూవీకి డబ్బింగ్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సమంత ఈ విషయం గురించి మాట్లాడుతూ నాకు పట్టుదల, మొండితనం కాస్త ఎక్కువే ఏ విషయాన్ని అయినా ముందుగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అదే పట్టుదల నేను ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యశోద మూవీకి డబ్బింగ్ చెప్పేటట్లు చేసిందని. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బాగా ఎమోషనల్ అయ్యారు.సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమానును శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో హరి ,హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.