యశోద మూవీకి సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. కెరియర్ లోనే హైయెస్ట్?

తాజాగా విడుదలైన యశోద మూవీలో సమంత లేడీ ఓరియంటెడ్ పాత్రలో యాక్షన్ త్రిల్లర్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి సినీ ప్రముఖుల నుంచి అటు సమంత అభిమానుల నుంచి ప్రశంసలను పొందుతుంది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11న దాదాపు 13 వందల థియేటర్లో విడుదలైన యశోద మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో అత్యధిక కలెక్షన్లను రాబడుతూ విజయ పరంపర కొనసాగుతోంది. సమంతా కెరీర్ లోని డిఫరెంట్ సినిమాగా నిలిచిన యశోద మూవీని శ్రీదేవి మూవీ పతాకంపై హరి హరీష్ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో నిర్మించారు.

భారీ అంచనాలతో విడుదలైన యశోద మూవీ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ యశోద మూవీలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలు నటించారు.
మెడికల్ మాఫియా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన యశోద పాన్ ఇండియా మూవీకి సమంత భారీ రెమ్యూనరేషన్ పొందిందని సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ పాన్ ఇండియా యశోద మూవీకి సమంత దాదాపు 6 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది
అయితే ఈ విషయంపై సమంతకాని యశోద మూవీ మేకర్స్ గాని ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సమంత ఇప్పటివరకు అత్యధిక పారితోషకం అందుకున్న సినిమా పుష్ప ఈ సినిమాలో సమంత కేవలం ఐటమ్ సాంగ్ కి అత్యధిక రెమినేషన్ పొందాలని చర్చ నడిచింది. ఇప్పుడు అంతకుమించి రెమ్యూనరేషన్ యశోద మూవీలో తీసుకోవడం విశేషం ఈ సినిమాలో సమంత నటించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మైమరిపించాయి. ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యూనిక్ బెన్ తో డైరెక్ట్ చేయడం ఈ సినిమాకు ఇంకో విశేషంగా చెప్పవచ్చు. ఈ సినిమాకి మణిశర్మ అందించిన అద్భుత బాణీలు ప్రేక్షకులను మైమరిపించాయి.