సినిమాలలోకి రాక ముందు సమంత ఏం చేసేదో తెలుసా?

ఏమాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సమంత. ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను సందడి చేసిన ఈమె వరుస సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత తాజాగా నటించిన యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈమె నటించిన యశోద సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఈ విధంగా పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన సమంత ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన టాలెంట్ తో వరుస సినిమా అవకాశాలను అందుకొని అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇకపోతే యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంత తాను సినిమాలలోకి రాకముందు చేసే పనుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సమంత సినిమాలలోకి రాకముందు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన పాకెట్ మనీ తానే సంపాదించుకునేదని వెల్లడించారు.ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరికీ వెల్కమ్ చెప్పడానికి తాను వెళ్లేదని ఇలా మూడు గంటల పాటు నిలబడి అందరిని ఆహ్వానించగా తనకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు డబ్బులు ఇచ్చేవారు అంటూ సమంత తెలిపారు.ఇలా ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు పాకెట్ మనీ కోసం ఇలాంటి పనులు చేసే దాన్ని అంటూ ఈమె వెల్లడించారు. పాకెట్ మనీ కోసం పార్ట్ టైం జాబ్ చేసిన స్థాయి నుంచి పాన్ ఇండియా స్థాయి హీరోయిన్ గా ఎదిగారు.