అఫీషియల్ : “దేవర” ఓటిటి హక్కులు వారివే..!

ఈ ఏడాదికి టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మాసివ్ చిత్రం “దేవర” కోసం తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

ఇక రీసెంట్ గానే సినిమా నుంచి వచ్చిన మాస్ గ్లింప్స్ కి కూడా పాన్ ఇండియా ఆడియెన్స్ నుంచి గట్టి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఇది ఉండగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఆల్ మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. దీనితో అంతకంతకు సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. దీనితో ఈ చిత్రం ఓటిటి హక్కులకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. దీనితో ఈ సినిమా ఓటిటి హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

కాగా ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం పాన్ ఇండియా భాషల్లో హక్కులని నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక దీనితో పాటుగా నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో వచ్చిన తర్వాత అతి త్వరలోనే తమ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో అయితే వచ్చేస్తుంది అని కూడా కన్ఫర్మ్ చేసేసారు.

సో మొత్తానికి ఈ సినిమా సంబంధించి ఓ బిగ్ అప్డేట్ ఓటిటి వీక్షకులకు వచ్చేసింది అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, కొత్త నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ వాళ్ళు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.