ఈ ఆస్తిత్వం..వ్యక్తిత్వం మీరే.. తండ్రి హరికృష్ణకు ఎన్టీఆర్‌ నివాళి!

నందమూరి తారకరామారావు నట వారసుడు హరికృష్ణ నటుడిగాను, రాజకీయ నాయకుడిగాను ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నిలిచిన నందమూరి హరికృష్ణ ’శ్రీకృష్ణావతారం’లో నటించి అలరించారు.

నటుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా వైవిధ్యమైన పాత్రలు పోషించిన హరికృష్ణ రాజకీయాలలోను సత్తా చాటారు. నందమూరి హరికృష్ణ 67వ జయంతి. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు నందమూరి అభిమానులు ఆయనని స్మరించుకుంటున్నారు.

తాజాగా తన తండ్రిని స్మరించుకుంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.నాన్న విూ 67వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ? ఈ అస్తిత్వం విూరు. ఈ వ్యక్తిత్వం విూరు.

మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం విూరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం విూరే‘ ఇట్లు విూ నందమూరి కళ్యాణ్‌ రామ్‌, నందమూరి తారకరామరావు అని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్విట్‌ చేశారు. కాగా ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అవుతుంది.