ఎన్టీఆర్ సినిమా నిజంగా అంతకి అమ్ముడుపోయిందా??

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి మాసెస్ట్ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఒకడు. కాగా ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. మరి తన గత సినిమా ఆర్ ఆర్ ఆర్ ఇచ్చిన ఫేమ్ తో వరల్డ్ వైడ్ గా దానిని కొనసాగించాలి అని తారక్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.

మరి దానిని ఇప్పుడు తాను చేస్తున్న సినిమా “దేవర” తో కొనసాగించాలని చూస్తున్నాడు. ఈ సినిమాని దర్శకుడు కొరటాల శివ హాలీవుడ్ లెవెల్ హంగులతో తెరకెక్కిస్తుండగా రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ కూడా క్రేజీ రెస్పాన్స్ అందుకుంది. ఇక వీటితో పాటుగా ఎన్టీఆర్ దేవర సినిమాని నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారని మొదటగా మేము తెలియజేసాం.

కాగా ఇదే నెట్ ఫ్లిక్స్ లో దేవర సినిమా అయితే రికార్డు ధరకి అమ్ముడుపోయినట్టుగా రూమర్స్ కాదు పోస్టర్ లే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్ వర్గాలే ఈ సినిమా రికార్డు మొత్తంలో 155 కోట్లకి అమ్ముడుపోయినట్టుగా వైరల్ చేస్తున్నారు.

అయితే ఇది కేవలం ఆర్భాటం కోసమే అని కొందరు అంటున్నారు. అలాగే సినిమా డీల్ ఎప్పుడో 90 కోట్లకి నెట్ ఫ్లిక్స్ కి అయిపోయింది అని ఇందులో ఎలాంటి నిజం లేదని కొన్ని వార్తలు ఉన్నాయి. కానీ ఇపుడు ఆల్ మోస్ట్ ఎన్టీఆర్ సెక్షన్ నుంచి మాత్రం దేవర 155 కోట్లకు అమ్ముడుపోయింది అని అంటున్నారు.

ఇది కానీ నిజం అయితే మాత్రం ఇండియా లోనే హైయెస్ట్ ధర పలికిన సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచింది అని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ కి పరిచయం అవుతుంది.