వైరల్ : “RRR” గ్రాఫిక్స్..ఎన్టీఆర్ చేతిలో పులి, నిప్పు కూడా నిజం కాదుగా..!

RRR

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాలో అనేక విజువల్ వండర్స్ ప్రేక్షకులని ఎంత గానో ఆకట్టుకుంటున్నాయి. అయితే హాలీవుడ్ తో పోలిస్తే మన ఇండియన్ సినిమా దగ్గర బడ్జెట్ రీత్యా చాలా తక్కువ సినిమాలే ఇలాంటివి అందులోని బెస్ట్ క్వాలీటివి వస్తాయి. అలా వచ్చిన ఒక బెస్ట్ ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే డెఫినెట్ గా ట్రిపుల్ ఆర్(RRR) అని చెప్పాలి. 

ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ ని ఇప్పటికీ రేపుతోంది. అయితే ఈ సినిమా రాజమౌళి కెరీర్ లో బెస్ట్ గ్రాఫికల్ వర్క్ అని చెప్పాలి. అందులో ఎన్టీఆర్ పై రెండు సీన్స్ కోసం ఇప్పుడు గ్రాఫికల్ వర్క్ రివీల్ అయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న జీ 5 వారు రీసెంట్ గా ఎన్టీఆర్ పై రెండు సాలిడ్ సీన్స్ విజువల్స్ పై మీమ్ వేయగా.. 

దానిపై గ్రాఫిక్స్ వండర్ ని ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ మేనేజర్ రివీల్ చేశారు. అయితే ఇది చూస్తే మాత్రం రాజమౌళి మ్యాజిక్ కనిపిస్తుంది. స్టార్టింగ్ లో ఎన్టీఆర్ పులి సీన్ లో మత్తులో ఉన్న పులిని తన చేతుల్లో ఎన్టీఆర్ పట్టుకుంటాడు అది ఎంత సహజంగా ఉంటుంది? 

అలాగే ఇంటర్వెల్ లో అయితే రెండు చేతుల్లో నిప్పులు చుట్టూ పులులు, చిరుతలు కలిసి దూకుతాయి కానీ ఈ రెండు సీన్స్ లో కూడా ఎన్టీఆర్ చేతుల్లో పులి లేదు మరో దాంట్లో నిప్పులు కూడా లేవు. ఇంటర్వెల్ సీన్ లో అయితే ఏకంగా ఎన్టీఆర్ చేతిలో లైట్స్ పెట్టేసారు. ఆ రకంగా ఈ సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతం చేసాయి.