షాకిస్తున్న ఎన్టీఆర్ డిజాస్టర్ రీ రిలీజ్ న్యూస్.!

1600x960_970495-jr-ntr

తెలుగు సినిమా దగ్గర రీ రిలీజ్ ట్రెండ్ అనేది ఇప్పుడే కొత్తగా వచ్చిందేమీ కాదు ఎప్పుడు నుంచో పలు చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు పాత ప్రింట్ కి కొత్త మెరుగులు సౌండ్ తో రీ రిలీజ్ చేస్తుండడంతో మంచి క్రేజ్ నెలకొంది. కాగా ఈ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఆల్రెడీ భారీ రికార్డులు కొల్లగొట్టగా. 

నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ ల సినిమాలు కూడా సిద్ధం అయ్యాయి. అయితే ఈ మధ్యనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ “బాద్షా” రీ రిలీజ్ కాగా ఇప్పుడు ఓ సినిమా రీ రిలీజ్ అంటూ వచ్చిన వార్త సినీ వర్గాల్లో షాకింగ్ గా మారింది. కాగా ఆ సినిమా ఏదో కూడా కాదు ఎన్టీఆర్ కెరీర్ లో భారీ డిజాస్టర్స్ లో ఒకటైన ‘ఆంధ్రావాలా’ అట.

దర్శకుడు పూరి జగన్నాథ్ మంచి స్వింగ్ లో ఉన్న సమయంలో చేసిన మాస్ చిత్రం ఇది. అయితే కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఈ సినిమా డిజాస్టర్ అయ్యి అప్పుడు భారీ నష్టాలు మిగిల్చింది. అయితే సడెన్ గా ఈ సినిమా రీ రిలీజ్ అంటూ ఇపుడు తీసుకురావడం అందరికీ షాక్ గా మారింది.

ఈ సినిమా రీ రిలీజ్ ఎందుకు అని సినీ వర్గాల వారు అనుకుంటున్నారు. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు కానీ మార్చ్ రిలీజ్ అంటూ అనౌన్స్ చేసారు. మరి ఈ సినిమాకి ఏమన్నా రెస్పాన్స్ ఉంటుందో లేదో వేచి చూడాలి.