ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకింత ఎక్కువ ఫీల్ అవుతున్నారా?

NTR-Junior-RRR-Highlights-films

గత కొన్ని రోజులు నుంచి వరల్డ్ సినిమా దగ్గర భారీ హైప్ తో మారుమోగిన మన టాలీవుడ్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR). హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి అయితే తెరకెక్కించారు. మరి వీరి అందరి సమిష్టి కృషి అందులోని సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాలు ఏకంగా ఆస్కార్ వరకు ఈ చిత్రాన్ని తీసుకెళ్లాయి.

అయితే సినిమా రిలీజ్ అయ్యాక మెయిన్ హీరో ఎవరు అనే అంశం చరణ్ నుంచి ఎన్టీఆర్ కి రాగ అక్కడ నుంచి మెల్లగా ఎన్టీఆర్ కి ఈ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు బెస్ట్ నటుడు గా వచ్చేస్తుంది అని ఇన్ని రోజులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హంగామా నడిచింది.

నిజానికి ఇద్దరు హీరోలకి కూడా హాలీవుడ్ లెవెల్ మీడియా నుంచి అనేక అంశాల్లో ప్రశంసలు రాగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ పై ఫోకస్ బాగా పెట్టడం తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హైప్ చేశారు. మరి ఈ సమయంలో చరణ్ ఫ్యాన్స్ అంతగా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఆస్కార్ ప్రకటనలు వచ్చే వరకు టెన్షన్ తప్పలేదు.

కానీ ఫైనల్ గా లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు లేకపోవడం రాజమౌళి కీరవాణి లకి మాత్రమే గుర్తింపు లు రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరికి నచ్చలేదు దీనితో ఈ విషయంలో తమ హీరోకి గుర్తింపు రాలేదు కానీ వారికి వచ్చింది అని ఒకింత ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఏదైనా సక్సెసే సినిమా అక్కడ వరకు వెళ్ళింది దీనితో మధ్యలో ఫ్యాన్స్ ఇలా హర్ట్ అవ్వడం అర్ధ రహితం.