‘NTR30’ లాంచ్ లో వైరల్ గా మారిన తారక్ డైనమిక్ ఎంట్రీ.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఓ హీరోకి భారీ మాస్ అపీల్ రావడం అనేది చిన్న విషయం కాదు మరి అలాంటి మాస్ అపీల్ ఉంటే గనుక టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు వసూళ్లు అయితే వస్తాయి. మరి అలాంటి హీరోస్ లో నందమూరి వారసుడు నందమూరి లెగసీ మోస్తున్న వాడు ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి.

మరి తారక్ ఇప్పుడు చేస్తున్న అలాంటి ఓ మాస్ సినిమా కోసమే ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివతో తారక్ తన కెరీర్ లో 30వ సినిమాగా చేస్తుండగా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు అయితే హైదరాబాద్ ఓ హోటల్లో మొదలయ్యింది.

మరి అనేక మంది దర్శకులు ప్రముఖులు, నిర్మాతలు హాజరైన ఈ ఈవెంట్ లో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్గొంది. అయితే ఇంతమందిలో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాలూకా డైనైమిక్ ఎంట్రీ నే క్రేజీ హైలైట్ గా మారింది. గడిచిన కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ ని చూసిన వారికీ ఇప్పుడు చూసిన లుక్ కి తాను మరింత డాషింగ్ గా కనిపిస్తున్నాడని చెప్పాలి.

వైట్ షర్ట్ లో క్యాప్ పెట్టుకొని వచ్చిన తారక్ తన సాలిడ్ పర్సనాలిటీ తో మరింత హుందాగా కనిపిస్తున్నాడు. దీనితో తమ అభిమాన హీరోని చూసి ఫ్యాన్స్ ఇప్పుడు మురిసిపోతున్నారు. దీనితో ఇప్పుడు ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.