ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ తో ఎన్టీఆర్ సినిమా బిగ్ ట్రీట్??

రానున్న రోజుల్లో టాలీవుడ్ సినిమా నుంచి వచ్చే పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లు చాలానే ఉన్నాయి. మరి ఈ లిస్ట్ లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాసివ్ ఏక్షన్ డ్రామా “దేవర” కూడా ఒకటి. అనౌన్సమెంట్ తోనే ఎంతో హైప్ రేపిన ఈ చిత్రం రిలీజ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఎట్టకేలకి ముగింపు దశకి చేరుకుంటున్న ఈ చిత్రం నుంచి టీజర్ వస్తున్నట్టుగా ఇటీవల కొన్ని రూమర్స్ గట్టిగా వినిపించాయి. మరి ఈ టీజర్ పై మరో క్రేజీ ఇన్ఫో సినీ వర్గాలు నుంచి బయటకు వచ్చింది. దీనితో ఈ మాసివ్ టీజర్ ని మేకర్స్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం “సలార్” తో కలిపి అటాచ్ చేసి రిలీజ్ చేస్తారని అంటున్నారు.

అయితే ఈ వర్క్ కోసం మేకర్స్ ఇప్పుడు గట్టిగా కస్టపడుతున్నారట. సలార్ సినిమాకి దేవర టీజర్ ని అటాచ్ చేస్తే మరింత రీచ్ ఇండియా వైడ్ వస్తుంది అని వారు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇది ఒకవేళ మిస్ అయినా కూడా ఇదే డిసెంబర్ లోనే దేవర టీజర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని కూడా సమాచారం వినిపిస్తుంది.

దీనితో ఇదే ఏడాదిలో మూవీ లవర్స్ ఒక మాసివ్ ఫిలిం ఫెస్టివ్ ఎండింగ్ రాబోతుంది అని చెప్పొచ్చు. ఇంకా ఈ క్రేజీ న్యూస్ పై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా ప్రభాస్ ఆదిపురుష్ విలన్ సైఫ్ అలీఖాన్ దేవర లో విలన్ గా నటిస్తున్నాడు.