“NTR30”.. ఈ పనుల్లో బిజీ బిజీ.!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి యంగ్ టైగర్ అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో భారీ హైప్ అందుకోగా ఇప్పుడు నెక్స్ట్ తన కెరీర్ లో 30వ సినిమాపై అనేక అంచనాలు పాన్ ఇండియా లెవెల్లో సెట్టయ్యాయి.

అయితే ఈ సినిమా విషయంలో హీరోయిన్ ఎవరు? సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని అభిమానులు కోరుకుంటుండగా ఫైనల్ గా అభిమానులని శాంతింపజేయడానికి మేకర్స్ గత కొన్ని వారాల కితం నుంచి అప్డేట్స్ స్టార్ట్ చేశారు.

ఇక ఈ వారం కూడా ఇంకో కొత్త అప్డేట్ ని మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ మరియు సంగీత దర్శకుడు అనిరుద్ తో కలిసి మ్యూజికల్ సిట్టింగ్స్ లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నట్టు కన్ఫమ్ చేసారు. దీనితో ఈ చిత్రం పై ఇప్పుడు మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఈ సినిమాపై నెలకొనగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించనున్నారు. అలాగే వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది.