ఈ కీలక సీన్స్ తో “NTR 30” స్టార్ట్.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ హైప్ ఉన్నటువంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన రెండో సినిమా కూడా ఒకటి. అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా ఇది తెరకెక్కుతూ ఉండగా రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఈరోజు నుంచే షూటింగ్ ని స్టార్ట్ చేసుకున్నట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. కాగా మరి మొదటి రోజు అయితే ఓ భారీ ఏక్షన్ సీక్వెన్స్ తోనే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ భారీ సెట్టింగ్స్ ని మేకర్స్ ప్లాన్ చేయగా కొన్ని రోజులు కితమే కొన్ని బ్లడ్ ట్యాంకర్లు కూడా తీసుకొచ్చారు.

దీనితో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై మరింత హైప్ నెలకొంది. ఇక ఈ భారీ సినిమా అయితే వాటర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా సినిమా లైన్ ని కూడా కొరటాల శివ అయితే రివీల్ చేసారు. దీనితో భారీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ మాసివ్ సినిమాలో అయితే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె ఈ సినిమాతో టాలీవుడ్ లో డెబ్యూ ఇస్తుంది. అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో అయితే నిర్మాణం వహిస్తున్నారు.