ఇండస్ట్రీ టాక్ : NTR30 హీరోయిన్ పై క్లారిటీ అప్పుడే.!

పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తర్వాత అందులో ఇద్దరు హీరోలు నెక్స్ట్ ఒకో సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం పరిస్థితి మరింత ఆసక్తిగా నెలకొంది. దర్శకుడు కొరటాల శివ తో ఎన్టీఆర్ తన కెరీర్ లో 30 వ సినిమాని అనౌన్స్ అయితే చేసాడు కానీ అది అలా నత్త నడకనే వస్తుండడంతో ఫ్యాన్స్ లో నిరాశ మరింత పెరుగుతుంది.

ఓ పక్క షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు మరో పక్క పలు ఇబ్బందులు సినిమా షూటింగ్ ని ఇంకా దూరం చేస్తున్నాయి. అయితే ఈ భారీ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న కూడా బాగా సస్పెన్స్ గా మారగా దానికి ఫైనల్ గా బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ని మేకర్స్ అయితే కంప్లీట్ చేశారు.

కాగా ఈమె కి ఆల్రెడీ టెస్ట్ షూట్ కూడా కంప్లీట్ చేశారు. అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో ఈమె ఉందో లేదో అనే క్లారిటీ రేపే ఈ మార్చ్ 6 నే రానున్నట్టుగా లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్. ఈ మార్చ్ 6 న జాన్వీ పుట్టిన రోజు కావడంతో ఆమెపై బిగ్ అనౌన్సమెంట్ ని గ్రాండ్ లెవెల్లో ఇవ్వనున్నారని ఇప్పుడు తెలుస్తుంది.

సో ఈ సినిమా హీరోయిన్ పై అప్డేట్ రేపు వచ్చేస్తుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రం కొరటాల నీటి నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్ ఒకటి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ని భారీ బడ్జెట్ తో ప్రెజెంట్ చేయబోతున్నారు.