షాకివ్వబోతున్న సమంత.. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందరూ సామ్ ని ఫాలో అవ్వాల్సిందే ..!

అక్కినేని సమంత నాగ చైతన్య ని పెళ్ళి చేసుకున్నాక సినిమాల పరంగా ఊహించని మార్పు కనిపిస్తోంది. పెళ్ళి కి ముందు సమంత చేసిన సినిమాలు దాదాపు గ్లామరస్ గా ఉన్నవే. పవన్ కళ్యాణ్ .. మహేష్ బాబు.. ఎన్.టి.ఆర్.. రాం చరణ్ సహా కోలీవుడ్ లోనూ దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. స్టార్ హీరోయిన్ గా సమంత కి ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ అసాధారణం. కెరీర్ లో ఇప్పటి వరకు సమంత నటించిన తెలుగు, తమిళ సినిమాలలో ఎక్కువగా బ్లాక్ బస్టర్స్ ఉండటం విశేషం.

Samantha hot songs edit😍😘😘 samantha tribute| actress samantha ruth  prabhu portrait heroine - YouTube

కాగా మొదటి సినిమా ఏ మాయ చేసావే సినిమాతోనే అక్కినేని నాగ చైతన్య తో ప్రేమలో పడిన సమంత పెళ్ళి చేసుకొని అక్కినేని కోడలైంది. అక్కినేని కోడలయిన దగ్గర్నుంచి కెరీర్ లో సినిమాలు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటోంది. పెళ్ళికి ముందు నటించినటువంటి గ్లామర్ రోల్స్ దాదాపు తగ్గించేసింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనెంట్స్ అయితేనే తప్ప సినిమాకి సైన్ చేయడం లేదు. ఈ క్రమంలోనే మజిలీ .. ఓ బేబీ సినిమాలు చేసింది. మజిలీ చైతూ – సమంత ల కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా మిగిలింది.

The Family Man Season 2: Samantha Akkineni to make her web debut with Manoj  Bajpayee show

కాగా సమంత మొదటిసారి సక్సస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ సీజన్ లో ఒక కీలక పాత్ర పోషించింది. ఇది సమంత డెబ్యూ వెబ్ సిరీస్. అయితే అందరూ సమంత వెబ్ సిరీస్ చేస్తుందనగానే పెద్దగా ఎగ్జైట్ అవలేదు కాని ఎప్పుడైతే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తుందని రివీల్ అయిందో అప్పటి నుంచి అందరికీ సమంత నటిస్తున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 మీద భారీగా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సీజన్ లో సమంత క్యారెక్టర్ చూశాక దాదాపు అందరు హీరోయిన్ ఆ తరహా పాత్రలని చేసేందుకు ఆసక్తి చూపిస్తారని అంటున్నారు. రాజ్ – కృష్ణ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.