నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్..”సింహాద్రి” వల్ల కూడా కాలేదు.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా అయితే అదిరే వసూళ్లు ఓపెనింగ్స్ రాబడతాయి. అయితే పవన్ కెరీర్ లో పెద్దగా ఎక్కువ హిట్ రేషియో కూడా లేదు. దాదాపు పదేళ్లు ప్లాప్ లలోనే ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి గత ఏడాది రెండు సినిమాలు రీ రిలీజ్ కావడం వాటికి రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు కాగా ఈ చిత్రాల్లో “ఖుషి” అయితే రీ రిలీజ్ లలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా సహా అన్ని చిత్రాలు రికార్డ్స్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “సింహాద్రి” రీ రిలీజ్ తో బ్రేక్ చేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం పవన్ “ఖుషి” రికార్డ్స్ ని మాత్రం అందుకోలేదని తెలుస్తుంది. అయితే సింహాద్రి సినిమాకి ఎన్నో ప్రమోషన్స్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో ప్రీ రిలీజ్ ఇలా చాలా హంగామా చేసినప్పటికీ కూడా ఖుషి రికార్డు అయితే టచ్ చేయలేదట.

దీనితో అయితే ఇక ఖుషి రికార్డు ని మరో సినిమా టచ్ చెయ్యడం కుదిరేది కాదు అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఏకంగా “నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్” అంటూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా మరి రీ రిలీజ్ లలో ఖుషి చిత్రం డే 1 కి 3.6 కోట్ల గ్రాస్ రాగా జల్సా చిత్రం 2.57 కోట్లు, సింహాద్రి 2.5 కోట్లు ఏపీ తెలంగాణాలో అందుకోగా..

కర్ణాటకలో కూడా ఖుషి కొద్ది పాటి లీడ్ లో ముందు వరుస లోనే ఉంది. దీనితో అయితే ఇలా ఇండియా లో నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ ఇప్పుడు నెలకొన్నాయి. కాగా యూఎస్ లో మాత్రం సింహాద్రి మాస్ రేజ్ చూపించినట్టుగా తెలుస్తుంది.