Bigg boss 4: అసలైన ఆట మొదలైంది.. సోమవారం ఎపిసోడ్ అస్సలు మిస్ కాకండి..!!

nominations in bigg boss house went on fire

మీరు ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఏ ఆట చూశారో కానీ.. ఇక నుంచి మాత్రం బిగ్ బాస్ హౌస్ లో అసలైన ఆట మొదలైంది. ఇది అస్లీ బిగ్ బాస్ హౌస్ అంటే. బిగ్ బాస్ హౌస్ అంటేనే టెన్షన్స్, గొడవలు, ప్రేమలు, స్నేహాలు, కొట్లాడుకోవడాలు.. తిట్టుకోవడాలు.. ఇవే కదా సగటు ప్రేక్షకుడికి కావాల్సింది. బిగ్ బాస్ కూడా ఇవన్నీ హౌస్ లో ఉండాలనే టాస్కులను డిజైన్ చేస్తుంటాడు. మొత్తానికి ఇంటర్వెల్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అసలైన ఆట మొదలైంది. బిగ్ బాస్ హౌస్ మెట్స్ కూడా తమ అసలైన ఆటను ప్రారంభించారు. నో సేఫ్ గేమ్స్ ఇక. సేఫ్ గేమ్స్ ఆడే చాన్సే లేదు అసలు.

nominations in bigg boss house went on fire
nominations in bigg boss house went on fire

అయితే.. మీరు ఇన్ని రోజులు బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసినా చూడకపోయినా.. చివరకు నాగార్జున ఎపిసోడ్ చూడకపోయినా.. ఇవాళ్టి ఎపిసోడ్ మాత్రం చూసేయండి. సోమవారం నామినేషన్స్ సమయంలో హౌస్ మెట్స్ మామూలుగా లేరు. ఒక్కొక్కరు నామినేషన్ చేస్తూ తెగ ఫైర్ అయిపోయారు.

అందరు కంటెస్టెంట్లు తాము నామినేషన్ వేస్తూ మిగితా కంటెస్టెంట్ల మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అసలు.. దానికి సంబంధించిన ప్రోమో చూస్తేనే అర్థం అయిపోతుంది. ఇక మున్ముందు బిగ్ బాస్ ఎలా ఉండబోతోందో?

ముఖ్యంగా అభిజీత్, అమ్మ రాజశేఖర్ మధ్య.. అరియానా, సొహైల్ మధ్య… ఇలా.. ప్రతి ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య హీట్ పెరిగిపోయింది. ఇది కదా.. అసలైన బిగ్ బాస్ గేమ్ అంటే. చూద్దాం.. ఇంకా మున్ముందు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో?

Asalaina aata modalu...Nomination process started #BiggBossTelugu4 today at 9:30 PM on #StarMaa