ఇండస్ట్రీ టాక్ : ఈ డైరెక్టర్ తో మెగాస్టార్ ప్రాజెక్ట్ కి కథ దొరకట్లేదట.!

filmcompanion_2022-09_17d7dcbe-4224-4a5b-b19f-f5923128e04a_Chiranjeevi_1

సంక్రాంతి కానుకగా వచ్చి భారీ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా భోళా శంకర్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇపుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతుంది. అయితే మెగాస్టార్ ఎందుకో కనుమరుగు అయిపోతున్న పాత దర్శకులని మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఎంతోకొంత తన సైడ్ నుంచి సాయం అన్నట్టుగా రీమేక్స్ తో ఛాన్స్ ఇస్తున్నారు.

అలాగే ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న దర్శకుడు మెహర్ రమేష్ కి భోళా శంకర్ తో ఛాన్స్ ఇచ్చి పని కల్పించారు. ఇక నెక్స్ట్ ఇలాగె మరి దర్శకునికి చిరు ఛాన్స్ ఇస్తున్నట్టుగా లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్. ఆ దర్శకుడు వివి వినాయక్ అని తెలుస్తుంది. కాగా వినాయక్ మరియు చిరు కెరీర్ లో ఠాగూర్, ఖైదీ 150 లాంటి సెన్సేషనల్ హిట్స్ ఉన్నాయి.

ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయ్యింది కానీ సినిమా కి సరైన కథ ఇంకా లాక్ అవ్వలేదట. దీనితో అసలు కథ లేకుండా సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అని టాక్ మొదలయింది. కాగా ఆల్ మోస్ట్ వీరి కాంబోలో ఓ రీమేక్ సినిమానే ఉండొచ్చని అంటున్నారు.

మరి వీరి నుంచి ఎలాంటి సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక భోళా శంకర్ లో అయితే తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీలక రోల్ లో కీర్తి సురేష్ కూడా నటిస్తుంది. అలాగే ఇది మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.