స్ట్రేంజ్ : “భోళా శంకర్” ని క్రాస్ చెయ్యలేకపోయిన “భగవంత్ కేసరి”

జెనరల్ గా బాక్సాఫీస్ దగ్గర ఓ హీరో సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా కూడా మొదటి రోజు వసూళ్లు మాత్రం భారీ లెవెల్లో ఉంటాయి. కానీ మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ విషయంలో జరిగిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఇపుడు ఆసక్తిగా మారింది. కాగా ఈ ఏడాది స్టార్టింగ్ లోనే బాలయ్య సహా చిరంజీవి చిత్రాలు వచ్చాయి.

అందులో రెండూ హిట్ టాక్ తెచుకున్నప్పటికీ చిరు సినిమా భారీ వసూళ్ల మార్జిన్ తో చిరు సినిమా డామినేట్ చేసింది. సరే అది మల్టీ స్టారర్ కాబట్టి చిరు క్రెడిట్ పక్కన పెడితే నెక్స్ట్ సోలోగా వచ్చిన సినిమా అది కూడా మళ్ళీ మంచి పోటీ లోనే వచ్చిన సినిమా “భోళా శంకర్” ఈ సినిమాకి అయితే ఎంత దారుణమైన నెగటివ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరి ఈ లెవల్లో డిజాస్టర్ టాక్ ని ఇంకా సినిమా చూడకుండానే చెప్పేసిన వాళ్ళ వల్లే చాల నష్టం వచ్చింది. మరి ఇంతటి డిజాస్టర్ సినిమా వసూళ్ళని కూడా లేటెస్ట్ గా బాలయ్య నటించిన “భగవంత్ కేసరి” మొదటి ఆట నుంచే మంచి రివ్యూస్ కూడా అందుకొని వచ్చిన చిత్రం వసూళ్లతో అందుకోలేకపోయింది అని ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.

దీనితో అసలు చాలా చోట్ల మెయిన్ గా ఉత్తరాంధ్రలో అయితే భోళా శంకర్ వసూళ్ళని భగవంత్ కేసరి క్రాస్ చేయలేదట. ఇంకో ఊహించని అంశం ఏమిటంటే రెండో రోజు వసూళ్లు కూడా భోళా కంటే భగవంత్ కేసరికి చాలా చోట్ల తక్కువే రిజిస్టర్ అయ్యాయి అని తెలుస్తుంది. దీనితో అసలు ఇంత స్ట్రేంజ్ గా జరగడం ఏంటా అని చాలా మందికి అర్ధం కావట్లేదు. దీనితో భోళా శంకర్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.