టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో ఇపుడు అంతా కూడా తమ ఏజ్ కి తగ్గ భారీ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు రీసెంట్ గా బాలయ్య కూడా భగవంత్ కేసరి అనే తన ఏజ్ కి తగ్గ సాలిడ్ సినిమా చేసి మంచి హిట్ కొట్టగా మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన మార్క్ భారీ సినిమా చేయాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ లైనప్ లో మెగాస్టార్ అందరినీ బాగా ఎగ్జైట్ చేసిన సినిమానే దర్శకుడు వసిష్ఠతో అనౌన్స్ చేసిన సినిమా. ఇది మెగాస్టార్ కెరీర్ లో 156వ సినిమాగా ఇపుడు మారగా ఈ రోజు ముహూర్తంతో అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఓ క్రేజీ గాసిప్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
దీనితో అయ్యితే చిరు కోసం యూవీ క్రియేషన్స్ వారు ఒక రికార్డు బడ్జెట్ ని ఈ సినిమాకి పెడుతున్నారట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకి మినిమమ్ గా 200 కోట్ల బడ్జెట్ ని పేపర్ పై పెట్టారట. దీనితో ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా నిలిచింది.
కాగా దీనికి ముందు సైరా మరియు ఆచార్య చిత్రాలు భారీ బడ్జెట్ లు పెట్టగ వాటిని మించి భారీ మార్జిన్ తో 156వ సినిమా తెరకెక్కనుందట. అయితే ఈ సినిమాలో మేజర్ పార్ట్ అంతా గ్రాఫిక్స్ వర్క్ కే పోతుందట అందుకే ఈ రేంజ్ బడ్జెట్ ని పెడుతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి అయితే మెగాస్టార్ మాత్రం మళ్ళీ ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు అని చెప్పాలి.