స్టైల్ లో విక్రమ్ ను కొట్టేవాడే లేడు

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ విలక్షణమైన నటుడు మాత్రమే కాదు. స్టైలిష్ ఐకాన్ కూడా. ఈ విషయం అతని ఐ సినిమా చూస్తే ఈజీగా అర్ధం అయిపోతుంది. స్టైలిష్ మేకోవర్ లో ఇతర స్టార్స్ కి భిన్నమైన అవతార్ లో చియాన్ విక్రమ్ కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ధృవ్ విక్రమ్ కూడా స్టైలిష్ మేకోవర్ విషయంలో తండ్రిని బీట్ చేయలేడని చెప్పాలి.

ఎప్పటికప్పుడు తన బాడీ, లుక్స్ చాలా సునాయాసంగా మార్చేసుకోవడం చియాన్ విక్రమ్ అలవాటు. సినిమాలో హీరో క్యారెక్టర్ లావుగా ఉంటుంది అంటే వెంటనే దానికి తగ్గట్లుగా చాలా తక్కువ టైమ్ లో మారిపోతారు. అలాగే సన్నగా గడ్డంతో కనిపించాలన్నా కూడా అంతే ఈజీగా బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ అయిపోతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చియాన్ విక్రమ్ పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో మాసిన గడ్డం, పాతకాలం నాటి ట్రైబల్ తెగకి చెందిన నాయకుడిగా వింతైన ఆహార్యంలో కనిపిస్తున్నారు. అసలు ఆ లుక్ లో ఉన్నది విక్రమ్ అనే విషయాన్ని అర్ధం చేసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. అంతగా తనని తాను క్యారెక్టర్ కోసం విక్రమ్ మార్చేసుకున్నారు.

పొన్నియన్ సెల్వన్ సినిమాలో కరికాల వల్లభన్ గా దృఢమైన శరీరంతో మహాబలుడు తరహాలో కనిపించన విక్రమ్ తంగలాన్ కోసం పూర్తిగా మారిపోయారు. పొన్నియన్ సెల్వన్ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో విక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంగలాన్ లుక్ లోనే గెడ్డంతోనే కనిపించిన అదిరిపోయే షూట్ వేసుకొని ఫ్రెంచ్ మోడల్ మాదిరి స్టైలిష్ అవతార్ లో కనిపించడం విశేషం.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెటరన్ ఫ్రెంచ్ మోడల్స్ ఇదే రకమైన లుక్స్ తో ఉండేవారు స్టైలిష్ కి కేరాఫ్ గా ఫ్రెంచ్ ని అందరూ చూపిస్తారు. ఇప్పుడు చియాన్ విక్రమ్ కూడా అలాగే ఫ్రెంచ్ మోడల్ లా ఈ లుక్స్ లో అదిరిపోయే విధంగా ఉన్నాడనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తూ ఉండటం విశేషం.