పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం రిలీజ్ కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అయితే ఫైనల్ గా సరికొత్త డేట్ తో నిన్న మాసివ్ అప్డేట్ ని అందించారు.
దీనితో మరోసారి రెబల్ ఫ్యాన్స్ కి మళ్ళీ మంచి ఊపు రాగా ఇక ఈ సరికొత్త డేట్ కోసం ఇప్పటి నుంచే ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని మొదటి నుంచి కూడా యూఎస్ రిలీజ్ పట్ల అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ప్రత్యంగిరా వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నెవర్ బిఫోర్ ఇండియా రిలీజ్ గా అయితే ఇది రాబోతుంది అని రికార్డు లొకేషన్స్ ని లాక్ చేశారు.
అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ అందులోని భారీ క్లాష్ ఉన్నప్పటికీ వారు మాత్రం తాము ఇచ్చిన మాట ప్రకారమే 1979 అంతకు మించే లొకేషన్స్ లో సలార్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో యూఎస్ లో మాత్రం సలార్ రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని చెప్పాలి.
కాగా ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా నటిస్తుండగా రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కేజీఎఫ్ నిర్మాతలే ఈ సినిమాని కూడా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
no change in salaar sensational release in usahttps://twitter.com/PrathyangiraUS/status/1707757240256430517