మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిందని వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. గత కొంతకాలం నుంచి శ్రీజ తన రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కి దూరంగా ఉండటమే కాకుండా ఆయన కూడా మెగా కుటుంబానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలలో కూడా పాల్గొనలేదు. మెగా కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల వీరిద్దరు విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే వీరి విడాకులు కూడా అధికారకంగా అయిపోయాయని ఆ విషయాన్ని మెగా కుటుంబం బయటకు చెప్పలేదని వార్తలు షికారులు చేస్తున్నాయి.
ఈ విధంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ వైవాహిక జీవితం గురించి ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై మెగా కుటుంబం ఏ మాత్రం స్పందించలేదు. దీంతో శ్రీజ గురించి వస్తున్నటువంటి వార్తలు నిజమేనని అందరూ భావించారు. ఇక కళ్యాణ్ దేవ్ సైతం తన పిల్లలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ కుమార్తె నవిష్క, శ్రీజ మొదటి భర్త కుమార్తె నివృత్తి ఇద్దరూ కూడా తన వద్ద ఉన్నారు.ఇక పిల్లల బాధితులను చూసుకుంటూ శ్రీజ ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నారని తెలుస్తుంది.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా శ్రీజ పెద్ద కుమార్తె నివృత్తి సోషల్ మీడియా వేదికగా గతంలో వీరు దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు.ఇలా ఒకప్పటి ఫోటోలను షేర్ చేస్తూ స్కూల్ లైఫ్ మిస్ అవుతున్న అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు. ఇందులో కళ్యాణ్ దేవ్ ఫోటో ఉండడం విశేషం.ఈ విధంగా నివృతి కళ్యాణ్ ఫోటోలను షేర్ చేయడంతో శ్రీజ కళ్యాణ్ విడిపోలేదని ఒకవేళ విడిపోయి ఉంటే నివృత్తి ఇలాంటి ఫోటోని ఎందుకు షేర్ చేస్తుంది అంటూ మరోసారి విరి విడాకుల గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.