Nitin : మాచర్ల నియోజకవర్గం లో నితిన్ పాత్ర ఏమిటో చెప్పేసారుగా…!

Nitin : హీరోగా తనదైన మార్క్ సినిమాలతో ఓ వైపు డిస్ట్రిబ్యూషన్ లోనూ కొనసాగిస్తూ సక్సెస్ అవుతున్నాడు హీరో నితిన్. నితిన్ పెళ్లి తర్వాత చేసిన మాస్ట్రో, చెక్ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు రంగ్ దే పర్వాలేదు అనిపించింది. భీష్మ తరువాత మంచి హిట్ నితిన్ అందుకోలేదు అందుకే తన సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు నితిన్.

రాజకీయ నేపథ్యంతో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న మాచర్ల నియోజకవర్గం చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌ లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. అనుభవం గల సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు. భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్‌ తో కలిసి పనిచేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ పని చేశారు. ఇక నితిన్ కు జోడిగా కేథరిన్ థెరిసా, కృతి శెట్టి నటిస్తున్నారు.

ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వంలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా, ‘మాచర్ల నియోజకవర్గం’ ఫస్ట్ ఛార్జ్ పేరుతో ఫస్ట్ లుక్‌ కి సంబంధించిన అప్‌డేట్‌ తో మేకర్స్ ముందుకు వచ్చారు. వినూత్నంగా మార్చి 26న ఫస్ట్ ఛార్జ్ తీసుకోబోతున్నట్లుగా ప్రభుత్వ ఉత్తర్వు శైలిలో ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు, “ఐఏఎస్ అధికారి యొక్క కింది పోస్ట్ తక్షణమే అమలులోకి వస్తుంది – శ్రీ ఎన్. సిద్ధార్థరెడ్డి, IAS (2022) గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. తన మొదటి ఛార్జ్‌ని మార్చి 26న ఉదయం 10:08 గంటలకు తీసుకుంటున్నారు. అంటూ ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కలెక్టర్‌ గా కథానాయకుడు ఎదుర్కోబోయే సవాళ్లను సూచించేదిగా ఈ ఆర్డర్ కాపీ ఎర్రటి మరకలతో నిండి ఉంది.