Daaku Maharaaj OTT: ఓటీటీలో డాకు మహారాజ్.. పోస్టర్‌ ఫై నెటిజన్ల ట్రోల్స్.. అసలేం జరిగిందంటే!

Daaku Maharaaj OTT: టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ లు హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందేఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రల్లో మెరిశారు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు.

ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా థియేటర్లో మంచి సక్సెస్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈనెల 21 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన చేసారు.

 

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. అయితే ఇప్పుడీ పోస్టర్‌ వల్లే వివాదం మొదలైంది. డాకు మహారాజ్‌ సినిమాలో పోలీసాఫీసర్ గా ఒక కీలక పాత్ర పోషించిన ఊర్వశి రౌతేలా ఫొటో లేకపోవడం పై ఆమె ఫ్యాన్స్‌ మండి పడుతున్నారు. దబిడి దిబిడి సాంగ్‌ తో అభిమానులను ఒక ఊపు ఊపేసిన ఊర్వశికి ఇదేనా గుర్తింపు అంటూ ఓటీటీ దిగ్గజం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు. అదే సమయంలో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతదేశపు మొదటి మహిళను పోస్టర్‌ నుంచి తీసేస్తారా అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి డాకు మహారాజ్‌ పోస్టర్‌ లో బాలీవుడ్ బ్యూటీ ఫొటో లేకపోవడం నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.. మరి ఈ విషయంఫై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.