క్రేజీ తార లావణ్యా త్రిపాఠీ టాలీవుడ్ లో యమా బిజీగా మారుతోంది. సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్సుప్రెస్’, కార్తికేయ గుమ్మకొండ ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో లావణ్యా త్రిపాఠీ కథానాయికగా నటిస్తున్నారు.
అయితే తాజాగా మరో సారి పెళ్లి లొల్లి ఆమెను వెంటాడుతోంది. ‘మీరెప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? , ‘మీ చేతికి తొడగడానికి ఓ ఉంగరం ఉంది’ అంటూ ఇలా నెటిజనులు తెగ ఇబ్బంది పెడుతున్నారట. ఈ పెళ్లి లొల్లి ఇన్‌స్టాలో మరీ ఎక్కువై పోయింది.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో లావణ్యా త్రిపాఠీ ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. అప్పుడొకరు ‘మీరెప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు?’ అని అడిగారు. ‘మీ చేతికి తొడగడానికి ఓ ఉంగరం ఉంది’ అని సదరు నెటిజన్ పరోక్షంగా ప్రపోజ్ చేశారు. అందుకు బదులుగా లావణ్యా త్రిపాఠీ ”ఎందుకు? అమ్మాయిలు ఓ ఉంగరం కొనుక్కోలేరా? నా పుట్టినరోజున నాకు నేనే ఓ ఉంగరం బహుకరించుకుంటున్నా” అని చెప్పారు. డిసెంబర్ 15న ఆమె పుట్టినరోజు. లావణ్యా త్రిపాఠీ పెళ్లి ప్రశ్నలు ఆ ఒక్కదాంతో ఆగలేదు. ‘అక్కా… పెళ్లెప్పుడు?’ అని ఇంకొకరు అడిగారు. ”నా తల్లితండ్రులకు లేని ఆందోళన మీకెందుకు? ఈ ప్రశ్నను దాటి ముందుకు వెళ్లలేకపోతే మీ గురించి మీరు ఆందోళన చెందండి” అని లావణ్యా త్రిపాఠీ సమాధానం ఇచ్చారు.
నేను యాంగ్జైటీకి లోనయినప్పుడు భవిష్యత్తులో చేయాల్సిన అంశాల గురించి లేదా నా తర్వాత చిత్రం గురించి ఆలోచించడం మొదలుపెడతా. ఏదైనా అంశం మీద ఎక్కువసేపు సమయాన్ని వృథా చేయడం ఎందుకు చెప్పండి అని సమాధానమిచ్చింది. ఇంతటితో ఆగకుండా ఓ నెటిజన్ ‘మీకు అతడితో పెళ్లటగద.. గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారట. అతడే మీకు కాబోయే వరుడట’ అని తిక్క ప్రశ్నలు వేస్తూ ఆటపట్టించాడట. దాంతో ఇన్‌స్టాగ్రామ్ ని కట్ చేసి కబుర్లు చెప్పడం మానేసిందట