Lavanya Tripati: నా భర్తకు ఆమె పర్ఫెక్ట్ జోడి…. నటి లావణ్య షాకింగ్ కామెంట్స్?

Lavanya Tripati: సినీ ఇండస్ట్రీలో మెగా హీరోగా గుర్తింపు పొందిన వారిలో వరుణ్ తేజ్ ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల కాలంలో వరుణ్ ఎంతో విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నప్పటికీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వరుస డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.

ఇకపోతే గత ఏడాది వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠినీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మిస్టర్ అంతరిక్షం అనే సినిమాలలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు కానీ ప్రేమ విషయాన్ని మాత్రం బయట ఎక్కడ తెలియజేయలేదు. అయితే ఉన్నఫలంగా వీరిద్దరూ తమ నిశ్చితార్తాన్ని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక 2023 నవంబర్ ఒకటవ తేదీ వీరిద్దరూ ఇటలీలో ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

ఇక వివాహం తర్వాత లావణ్య త్రిపాఠి ఎలాంటి కొత్త ప్రాజెక్టుల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఇటీవల లావణ్య త్రిపాటికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ ఫంక్షన్లో సరదాగా మాట్లాడుతూ తన భర్తకు ఒక హీరోయిన్ చాలా పర్ఫెక్ట్ జోడి అంటూ ఈమె మాట్లాడారట. వరుణ్ తేజ్ తో కలిసి మీనాక్షి చౌదరి సాయి పల్లవి రాశీఖన్నా పూజా హెగ్డే వంటి హీరోయిన్లు నటించారు అయితే వీరందరిలోకెల్లా సాయి పల్లవి తన భర్త పక్కన చాలా బాగుంటుందంటూ లావణ్య మాట్లాడినట్లు తెలుస్తోంది.

వీరిద్దరి కాంబినేషన్లో ఫిదా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వరుణ్ సాయి పల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయని అలాగే వీరిద్దరి నటన, జోడి ఆన్ స్క్రీన్ పై చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.