రష్మిక మండన్నా, విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతోందంటూ చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తూనే వున్నాయ్. డేటింగ్‌లో వున్నారంటూ.. కాదు కాదు వీరిద్దరికీ పెళ్లయిపోయిందంటూ.. ఇలా ఈ జంట చుట్టూ బోలెడన్ని గాచిప్స్ చక్కర్లు కొట్టాయ్.. కొడుతూనే వున్నాయ్.
మేం జస్ట్ ఫ్రెండ్స్.. బెస్ట్ ఫ్రెండ్స్ అంతే.! అంటూ అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక మండన్నా.. ఇద్దరూ ఈ గాసిప్స్‌ని తిప్పి కొడుతున్నా ఆగడం లేదు. లేటెస్ట్‌గా దీవాళీ సెలబ్రేషన్స్ సైతం విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మండన్నా కలిసి సెలబ్రేట్ చేసుకుందన్న ఇంకో ప్రచారం కూడా వినిపించింది.
దాంతో, ఈ ఇద్దరికీ పెళ్లయిపోయిందన్న నమ్మకానికి వచ్చేశారు ఫ్యాన్స్. అయినా కానీ, పెళ్లి చేసుకుంటూ అంత సీక్రెట్‌గా చేసుకోవల్సిన అవసరం ఏముంది.? పెళ్లి కెరీర్‌కి ఏమీ అడ్డంకి కాదుగా ఈ రోజుల్లో.
అయినా, సినీ ఇండస్ర్టీలో ఈ తరహా గాసిప్స్ కొత్తేమీ కాదు, మొదట గాసిప్స్‌లో మొదలై తర్వాత పెళ్లి పీటల వరకూ వెళ్లిన ఎంతో మంది సెలబ్రిటీలను చూశాం. తాజాగా వరుణ్ లావణ్య జంట కూడా అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.
మరి, రష్మిక, విజయ్ దేవరకొండ ఎందుకిలా చేస్తున్నారు.? వారి మధ్య నిజంగానే రిలేషన్‌షిప్ వుండి వుంటే చెప్పేయొచ్చుగా.! అన్నది కొందరి అభిప్రాయం. లేదు, పెళ్లి చేసుకునే వుద్దేశ్యమే వుంటే.. అది కూడా బయట పెట్టేయొచ్చుగా.!
అప్పుడు ఈ జంటపై ఇంకా క్రేజ్ పెరిగిపోతుందిగా.! కానీ, సినిమా ఇండస్ర్టీలో దేనికైనా కొన్ని లెక్కలుంటాయ్.. ఆ లెక్కలు తీరేవరకూ కొంత గోప్యత ప్రదర్శించాల్సిందే. వరుణ్ లావణ్యపై ఎప్పటి నుంచో రూమర్స్ వచ్చినప్పటికీ తూచ్ అవన్నీ గాలి వార్తలే అని కొట్టిపడేశారు. కానీ, ఫైనల్‌గా ఏం జరిగింది.! వన్ పైన్ డే ఎంగేజ్‌మెంట్ అనౌన్స్ చేశారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. మరి, రష్మిక, విజయ్ దేవరకొండ ఏం చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.!